ఈకాలం - పొలిటికల్ న్యూస్ / : త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపద్యంలో ఇప్పటినుంచే ఆశవాహులు రంగం సిద్ధం చేస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా పవన్ రావు తన సొంత ప్యానల్ తో స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. మున్సిపాలిటీలకు డైరెక్ట్ చైర్మన్ ఎన్నిక జరిగితే స్వతంత్ర అభ్యర్థిగా మనిషా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
రిజర్వేషన్ అనుకూలించకపోయినా తన ప్యానల్ రంగంలో ఉంటుందని రంగినేని వర్గీయులద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో తన ప్యానల్ కు చెందిన దాదాపు 30 వార్డుల అభ్యర్థులు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. మొత్తంగా మున్సిపాలిటీలకు డైరెక్ట్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయా..? లేదా పాత పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయా.? రిజర్వేషన్లు ఎలా అనుకూలిస్తాయి..? అనే అంశాలపై తాజాగా ఆశావాహులు కసరత్తు చేస్తున్నారు.
EekalamAdmin